

ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మరట్వాడా, గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఫలితంగా కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అత్యధికంగా 6.67 సెం.మీ. వర్షపాతం నమోదవగా, జంగమహేశ్వరపురంలో 36.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కోస్తా తీరం వెంబడి గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!