

జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ్ నగర్‌కు చెందిన పాయల్ దేవి స్థానికంగా జరిగిన ఓ మేళాకు వెళ్లిన అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి ఆరోగ్యం బాగోలేదని, వైద్యుడిని కలవడానికి వెళ్తున్నానని చెప్పింది. ఆస్పత్రి వద్ద వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమైంది. మధ్యాహ్నం సమయంలో చినాబ్ నదిపై ఉన్న వంతెన వద్ద బైక్‌ను ఆపించి, అనంతరం నదిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు.
బైక్ నడుపుతున్న వ్యక్తి వెంటనే పాయల్ తండ్రికి సమాచారం అందించగా, ఆయన ఫోన్‌లో ఆమెతో మాట్లాడి వెనక్కి రావాలని ఎంతగానో ప్రయత్నించారు. అయినప్పటికీ ఆమె నదిలోకి దూకినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాయల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!