

అమెరికా ఎన్నికల్లో మెయిల్ బ్యాలెట్ల వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులకు ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఇందిరా తల్వానీ ట్రంప్ నిర్ణయాన్ని రెండు వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యంతర ఎన్నికలకు సంబంధించి మెయిల్ బ్యాలెట్ల పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తదుపరి విచారణ సెప్టెంబరు 3న జరగనుంది.
మెయిల్ బ్యాలెట్లకు సంబంధించిన కొత్త నిబంధనలను డెమొక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు, ఓటింగ్ హక్కుల సంఘాలు సవాలు చేశాయి. పోస్టల్ విభాగం కొత్త విధానాల ప్రకారం రాష్ట్రాలు ఓటర్ల జాబితాలను అందించడంతో పాటు బ్యాలెట్ల పంపిణీ వివరాలు, ఎన్వలప్‌ల రూపకల్పనను ముందుగానే ఖరారు చేయాలి. అలాగే పోర్టల్‌లో నమోదు, పౌరుల సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం, ఎన్నికల వ్యవస్థలను అప్‌డేట్ చేయడం, అధికారులకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలి. ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!