29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

Writer: Harika S 08:43 AM, 29 ఆగస్టు, 2026
బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

ప్రైమ్ వీడియో తెరకెక్కించిన ‘ది రివల్యూషనరీస్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఆసక్తికర చర్చ మొదలైంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియడ్ డ్రామా భారత స్వాతంత్య్ర పోరాటంలోని మరుగునపడిన ఓ కీలక ఘట్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. సెప్టెంబర్ 11న ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువ విప్లవకారుల త్యాగాలను చూపించనున్నారు. రాష్ బిహారీ బోస్‌గా భువన్ బామ్, సచీంద్ర నాథ్ సన్యాల్‌గా రోహిత్ సరాఫ్, బాఘా జతిన్‌గా గుర్ఫతే పిర్జాదా, ప్రతిభా లాహిరిగా ప్రతిభా రంటా నటించారు. ఈ నటీనటుల ఎంపికపై యువత నుంచి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో బెంగాలీ పాత్రల కోసం బెంగాలీ నటులను ఎంపిక చేయకపోవడంపై కొందరు స్థానిక ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

స్వాతంత్య్ర పోరాటంలో బెంగాల్ పాత్రను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నందుకు బెంగాలీ ప్రేక్షకులు గర్వపడుతున్నారు. గదర్ ఉద్యమం, కోమగాట మారు వంటి చారిత్రక అంశాలను కూడా కథలో ప్రస్తావించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. సుఖ్విందర్ సింగ్ అందించిన నేపథ్య గీతం ఉత్కంఠను మరింత పెంచింది. విప్లవకారుల పోరాటాలతో పాటు వారి స్నేహం, భయాలు, మానసిక వేదనను కూడా కథలో చూపించారు. ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోనిషా అద్వానీ, మధు భోజ్వాని నిర్మించిన ఈ సిరీస్‌ను సంయుక్త చావ్లా షేక్, అక్షితా వాధ్వానా, శోభిత్ నారంగ్, రుత్వి మెహతా రాశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

ట్యాగ్లు
ది రివల్యూషనరీస్ప్రైమ్ వీడియోనిఖిల్ అద్వానీభువన్ బామ్భారత స్వాతంత్య్ర పోరాటంబెంగాలీ నటులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?
గాసిప్స్

రష్మికకు దిగ్గజ గాయని పాత్ర ఖరారు?

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ విషయంలో యష్‌కు ఎదురుదెబ్బ?

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!
సినిమాలు

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!
గాసిప్స్

మాటలతో కాదు.. సినిమా తీసి చూపించాలా.. దీపికాపై ట్రోలింగ్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?
సినిమాలు

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?
గాసిప్స్

లెనిన్ తర్వాత భాగ్యశ్రీ ఎక్కడ?

బంగారం ధరలకు భారీ షాక్...
బిజినెస్

బంగారం ధరలకు భారీ షాక్...

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ మెయిల్‌ బ్యాలెట్‌ ఆదేశాలకు ఫెడరల్‌ జడ్జి బ్రేక్‌

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే
జనరల్

జోన్ వ్యాప్తంగా భారీ టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించిన దక్షిణ మధ్య రైల్వే

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత
జనరల్

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు అస్వస్థత

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు
జనరల్

కేసీఆర్‌కు రాఖీ కట్టిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!