

పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అనధికార ప్రయాణాలను అరికట్టడం, నిజమైన ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ఆగస్టు 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు జోన్ వ్యాప్తంగా విస్తృత టికెట్ తనిఖీ డ్రైవ్ నిర్వహించింది. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం, క్రమరహిత ప్రయాణం, బుక్ చేయని లగేజీతో ప్రయాణించడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.
ఈ డ్రైవ్‌లో టికెట్ లేకుండా లేదా సరైన అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న 13,964 మందిని, బుక్ చేయని లగేజీతో ప్రయాణిస్తున్న 1,189 మందిని గుర్తించారు. టికెట్ తనిఖీల ద్వారా రూ.1.28 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే రైల్వే ప్రాంగణంలో చెత్త వేసిన 37 మందికి రూ.6,400, ఐదుగురు అనధికార వ్యాపారులకు రూ.10,000, ధూమపానం చేసిన ఏడుగురికి రూ.14,000 జరిమానా విధించారు. ప్రయాణికులు చెల్లుబాటు అయ్యే టికెట్లతో ప్రయాణించి, రైల్వే నిబంధనలు పాటించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!