

చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే. గ్లామర్‌తో పాటు నటనతో ఆకట్టుకున్న ఈ భామ ఒక దశలో వరుస అవకాశాలతో బిజీగా కనిపించింది. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంటూ వెళ్లింది. అయితే ప్రస్తుతం ఆమె పేరు టాలీవుడ్ కొత్త సినిమాల విషయంలో పెద్దగా వినిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు భాగ్యశ్రీ నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. సాధారణంగా సినిమా సక్సెస్ తర్వాత హీరోయిన్లకు అవకాశాలు పెరుగుతాయి. కానీ ‘లెనిన్’ తర్వాత కూడా ఆమెకు కొత్త తెలుగు ప్రాజెక్టులు అధికారికంగా ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం అధికారికంగా భాగ్యశ్రీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ తమిళ చిత్రం ‘సేయాన్’ మాత్రమే. దీంతో టాలీవుడ్‌లో ఆమెకు అవకాశాలు తగ్గాయా, లేక కథలు, పాత్రల విషయంలో స్వయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. గతంలో విజయాలు అంతగా లేకపోయినా ఆమెకు వరుస అవకాశాలు రావడం గమనార్హం. ఇప్పుడు ‘లెనిన్’తో మంచి ఫలితం అందుకున్నా కొత్త ఛాన్సులు కనిపించకపోవడమే విచిత్రంగా మారింది. ప్రస్తుతం పరిశ్రమలో కొత్త హీరోయిన్ల నుంచి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో గ్యాప్ వస్తే తిరిగి రేసులోకి రావడం అంత సులువు కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే భాగ్యశ్రీ మాత్రం బలమైన పాత్రలు, విభిన్న కథల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ పెద్ద ప్రాజెక్ట్‌తో ఆమె తిరిగి సందడి చేస్తుందేమో చూడాలి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!