

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత లభించింది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రభుత్వ యాజమాన్య బ్యాంక్ ఓష్చాడ్‌బ్యాంక్ రష్యాపై దాఖలు చేసిన పెట్టుబడి ఒప్పంద వివాదంలో రష్యా తరఫు ఆర్బిట్రేటర్‌గా చంద్రచూడ్‌ను నియమించింది. 1998లో కుదిరిన ఉక్రెయిన్-రష్యా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం కింద ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ కొనసాగుతోంది. రష్యా ఆక్రమణకు గురైన ఉక్రెయిన్ ప్రాంతాల్లో తమ ఆస్తులు, కార్యకలాపాలు కోల్పోయామని ఓష్చాడ్‌బ్యాంక్ ఆరోపిస్తోంది.
ముగ్గురు సభ్యులతో కూడిన ఆర్బిట్రల్ ట్రైబ్యునల్ ఈ కేసును విచారించనుంది. కోస్టారికాకు చెందిన ఆర్బిట్రేటర్ డయాలా జిమెనెజ్ ట్రైబ్యునల్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తుండగా, ఉక్రెయిన్ బ్యాంక్ తరఫున గ్రీకు ఆర్బిట్రేటర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రెకౌలాకిస్ నియమితులయ్యారు. గతంలో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మరో రెండు పెట్టుబడి వివాదాల్లో రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాలని చంద్రచూడ్‌ను సంప్రదించినప్పటికీ, ఆయన ఆ కేసుల్లో బాధ్యత స్వీకరించలేదని నివేదికలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!