
జనరల్

ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన విదేశీ కంపెనీకి సమన్లు అందకపోవడంతో విచారణ వాయిదా పడిందని తెలిపారు. ఆ సంస్థకు ఈమెయిల్ ద్వారా సమన్లు పంపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
అంతకుముందు దాఖలు చేసిన తమ పిటిషన్‌ను న్యాయస్థానం రిటర్న్ చేసిందని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. మరోసారి సమన్ల కోసం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్‌పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 30న జరగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!