
గాసిప్స్

మహారాష్ట్రలోని పుణెలో వినూత్న గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో ఏకంగా 21 వేల పానీపూరీలతో 13 అడుగుల గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెదురు, కాగితంతో రూపొందించిన చట్రంపై ఒక్కో పానీపూరీని జాగ్రత్తగా అమర్చి ఈ భారీ విగ్రహాన్ని రూపొందించారు. పూజా కార్యక్రమాల కోసం పక్కనే మరో చిన్న గణపతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.
స్థానికంగా గణేష్ భేల్ దుకాణం నిర్వహించే రూపేష్, దినేష్ ఈ వినూత్న ఆలోచనకు రూపకల్పన చేశారు. సంప్రదాయ గణేశ్ చతుర్థి వేడుకలకు భిన్నంగా, పానీపూరీలతో గణపతి విగ్రహాన్ని రూపొందించడం స్థానికులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ స్ట్రీట్ ఫుడ్‌ను పండుగ కళతో మేళవించిన ఈ ప్రత్యేక విగ్రహం ప్రస్తుతం పుణెలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!