

పశ్చిమాసియాలో నెలకొన్న తాజా భౌగోళిక ఉద్రిక్తతలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు, ఇరాన్ హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు ప్రకటించడం అంతర్జాతీయ వాణిజ్యం, ముడి చమురు సరఫరాపై ఆందోళనలను పెంచి పెట్టుబడిదారుల్లో అప్రమత్తతను పెంచాయి.
అయితే బలమైన కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, ఆకర్షణీయమైన షేర్ ధరలు, విదేశీ పెట్టుబడుల పెరుగుదల మార్కెట్‌కు మద్దతుగా నిలిచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్ అండ్ టి, హెచ్‌సీఎల్ టెక్ వంటి సంస్థల త్రైమాసిక ఫలితాలపై కూడా పెట్టుబడిదారుల దృష్టి నిలిచింది. నిఫ్టీ 50 సూచీ 23,800 నుంచి 24,600 పాయింట్ల మధ్య కదిలే అవకాశం ఉందని, ఈ పరిధిని దాటే దిశలోనే మార్కెట్ తదుపరి ట్రెండ్ ఆధారపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!