

రాష్ట్రంలోని పురాతన ఆలయాల సంరక్షణ, అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉగ్రనరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణ పనులకు సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి భట్టి విక్రమార్క భూమిపూజ చేశారు.
పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రముఖ ఆలయాలను అభివృద్ధి చేయడంతోపాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు భట్టి తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాల అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించామని, పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్ల నిర్మాణం, ధర్మపురి, కోటిలింగాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!