7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

Writer: Chandrika 10:58 PM, 7 సెప్టెంబర్, 2026
వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

వానాకాలంలో ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోటా కింద కేటాయించిన 6.17 లక్షల మెట్రిక్ టన్నుల పోషకాలతో కూడిన సన్న బియ్యాన్ని సెప్టెంబర్ 5లోపు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసింది. మూడు నెలలకు ప్రభుత్వం కేటాయించిన 6.48 లక్షల మెట్రిక్ టన్నుల్లో 6,16,806 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించారు. సుమారు 99.30 లక్షల మంది రేషన్ కార్డుదారులకు బియ్యం అందగా, దాదాపు 2.95 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆగస్టు 31 నాటికి 94.2 శాతం పంపిణీ పూర్తికాగా, కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించడంతో ఇది 95.13 శాతానికి చేరింది.

పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, నిరంతరాయంగా జరిగేలా పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం, ఆన్‌లైన్ పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేశారు. ఈ-పాస్ (ePoS) మిషన్ల ద్వారా బియ్యం పంపిణీ చేయడంతో పల్లెలు, వార్డుల స్థాయిలో అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఆగస్టులో బియ్యం సరఫరా చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద 35,371 పాఠశాలల్లోని 27.36 లక్షల మంది విద్యార్థులకు 4,529 మెట్రిక్ టన్నుల బియ్యం, 4,389 సంక్షేమ హాస్టళ్లలోని 11.72 లక్షల మంది విద్యార్థులకు 13,555 మెట్రిక్ టన్నుల బియ్యం అందించారు. 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా బియ్యం పంపిణీ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

ఇన్వెస్ట్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై సీఎస్ సమీక్ష

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..
ట్యాగ్లు
తెలంగాణ పౌర సరఫరాలురేషన్ బియ్యంతెలంగాణ ప్రభుత్వంబియ్యం పంపిణీరేషన్ కార్డుదారులుఈ-పాస్ఆహార భద్రతమధ్యాహ్న భోజన పథకంసంక్షేమ హాస్టళ్లుఅంగన్‌వాడీ కేంద్రాలు
AdvertisementAdvertisement

తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఆగ్రహం..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...
జనరల్

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు త్రీలైన్‌ విప్...

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి
జనరల్

మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ఎంపిక పారదర్శకమే: శాప్ ఎండీ భరణి

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..
జనరల్

వానాకాలానికి ముందే రేషన్ బియ్యం పంపిణీ..

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి
రాజకీయాలు

మాటిస్తే నిలబడతాం.. ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటాం: కొండా సురేఖ, కొండా మురళి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మిర్జాపూర్: ది మూవీ’..

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి బాలు–మీనా ఎంట్రీ..

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్
జనరల్

దేశంలో మళ్లీ ఎన్నికల సందడి.. ఆరు స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..
సినిమాలు

మణిరత్నం కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్..

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?
షోస్

బిగ్ బాస్ హోస్టుల్లో ఎవరి రెమ్యునరేషన్ ఎక్కువ?

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...
జనరల్

వారంరోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..
జనరల్

ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!