

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక హామీలు ఇచ్చింది. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు సహా ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన సీఎం.. ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
సమావేశం అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. పీఆర్సీతో పాటు రెండు డీఏలు, ఒక సరెండర్ లీవ్, పోలీసులకు అదనంగా మరో సరెండర్ లీవ్, రిటైరైన ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్, ఈహెచ్‌ఎస్ బకాయిలను ప్రతి నెలా ఒకటో తేదీన ట్రస్ట్‌కు చెల్లించడం వంటి అంశాల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరినట్లు చెప్పారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంటరిమ్ రిలీఫ్ (ఐఆర్) విషయంలో కొంత సమయం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు సూర్యనారాయణ వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!