

ఆరోగ్యవంతమైన ప్రజలతోనే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, ఫిట్‌నెస్, క్రీడలు, మహిళలు, పిల్లల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఏ.వి. కళాశాల ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించిన ఐదు రోజుల జాతీయ పోషణ మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన ప్రభుత్వ కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా మారాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర, వ్యాయామం, నడక, యోగా, క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. అధిక చక్కెర, నూనె వినియోగాన్ని తగ్గించాలని, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని కోరారు. డిజిటల్ పరికరాల వినియోగాన్ని పరిమితం చేయడంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!