
సినిమాలు

తెలంగాణలోని వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2026-2028 కాలానికి కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో అర్హులైన రాష్ట్ర, జిల్లా స్థాయి జర్నలిస్టులకు రాయితీ బస్సు పాస్‌లు అందించాలని సమాచార, ప్రజాసంబంధాల శాఖ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కోరింది.
ఈ మేరకు సమాచార, ప్రజాసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ జి. ముకుంద రెడ్డి అధికారిక లేఖ పంపించారు. ప్రస్తుతం ఉన్న బస్సు పాస్‌ల గడువు ఈ నెల 16తో ముగియనున్నందున, 17-06-2026 నుంచి 30-04-2028 వరకు చెల్లుబాటు అయ్యే కొత్త పాస్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభమైందని, మిగిలిన కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!