

ఒక యువకుడు ముగ్గురు అక్కచెల్లెల్లను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇది నిజమైన వివాహం కాదని, కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం రూపొందించిన ఫ్రాంక్ వీడియో మాత్రమేనని విచారణలో తేలినట్లు తెలిపారు. వీడియోలు, ఫోటోలు విస్తృతంగా వైరల్ కావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. వీడియోలో కనిపించిన వారిలో ఒకరు మైనర్ అనే సమాచారం రావడంతో ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా పరిశీలించారు.
దర్యాప్తులో వైరల్ వీడియో పూర్తిగా నాటకీయంగా చిత్రీకరించబడినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే మైనర్ బాలికను ఇలాంటి వీడియోలో భాగం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వీడియోను నిజమని నమ్మకుండా ముందుగా వాస్తవాలను నిర్ధారించుకోవాలని ప్రజలకు సూచించారు. తప్పుడు ప్రచారాలు సమాజంలో అపోహలు సృష్టించడమే కాకుండా చట్టపరమైన సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!