
క్రీడలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు విజయనగరంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిరిజన సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే థింసా నృత్య ప్రదర్శన కోసం కళాకారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా సుమారు 13 వేల మంది గిరిజన బాలికలు, మహిళలు కలిసి భారీ స్థాయిలో థింసా నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఈ సాంస్కృతిక ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!