

సాంగ్‌సాక్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున సుమారు 4 గంటలకు పోలీసులు నాకా చెకింగ్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నలుగురు వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరపడంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు దుండగులు తీవ్రంగా గాయపడి మృతిచెందారు. మృతుల వద్ద లభించిన వివరాల ఆధారంగా వారి గుర్తింపును నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నలుగురికి రాష్ట్ర సరిహద్దుకు అవతల టాప్రా ప్రాంతంలో ఆగస్టు 25న జరిగిన ఓ ఘటనతో సంబంధం ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఈస్ట్ గారో హిల్స్ ఎస్పీ స్వప్నిల్ పవార్ ఘటనపై స్పందిస్తూ ముందుగా మృతుల గుర్తింపును నిర్ధారించాల్సి ఉందని తెలిపారు. అనంతరం వారి నేర చరిత్ర, గతంలో నమోదైన కేసులతో సంబంధాలపై విచారణ చేపడతామని చెప్పారు. నాకా చెకింగ్ వద్దకు వచ్చిన వారి వద్ద ఆయుధాలు ఎలా చేరాయి, కాల్పులు ఎలా ప్రారంభమయ్యాయి, పోలీసులపై కాల్పులు జరపడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!