
జనరల్

హైదరాబాద్‌లోని మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించిన నూతన హైలెవల్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆగస్టు 31న ఈ వంతెనను ప్రారంభించనున్నారు. సుమారు రూ.52 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి 400 మీటర్ల పొడవు, 14.5 మీటర్ల వెడల్పుతో ఉంది.
ఈ వంతెన అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట–మూసారంబాగ్ మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, ఇప్పటికే ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. పాదచారుల కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. ప్రారంభానికి ముందు రోడ్డు అప్రోచ్‌లు, భద్రతా చర్యలు, లైటింగ్ తదితర పనులను అధికారులు పూర్తి చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!