

ఉజ్బెకిస్తాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ఒలియ్ దరాజలి దోస్త్‌లిక్’ ఆర్డర్‌ను అధ్యక్షుడు షావ్కత్ మిర్జియోయెవ్ ప్రదానం చేశారు. రెండు దేశాల మధ్య స్నేహం, సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు. ఈ పురస్కారాన్ని భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య చిరకాల స్నేహానికి ప్రతీకగా భావిస్తున్నానని మోదీ తెలిపారు.
తాష్కెంట్‌లో మోదీ, మిర్జియోయెవ్ చర్చల్లో భారత్-ఉజ్బెకిస్తాన్ సంబంధాలను సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మౌలిక సదుపాయాలు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ, క్రిటికల్ మినరల్స్, క్లీన్ ఎనర్జీ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో సహకారాన్ని పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!