

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టినరోజులను పురస్కరించుకుని వారి సూపర్‌హిట్ చిత్రాలను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మహేశ్‌బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు రీరిలీజ్ అయి ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘వర్షం’ కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
2004లో శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వర్షం’లో ప్రభాస్‌కు జోడీగా త్రిష నటించగా, గోపిచంద్ ప్రతినాయకుడిగా కనిపించారు. ఎం.ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు సినిమాను 4కే అల్ట్రా హెచ్‌డీ ఫార్మాట్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు, ఇతర వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. సినిమాలోని పాటలు, పలు సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైనవిగా ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!