

ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌లో కూడా వర్షం తీవ్రంగా పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షాల ప్రభావం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) కార్యకలాపాలపై కూడా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మొత్తం 14 విమానాలను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించారు. వీటిలో 11 విమానాలను జైపూర్ విమానాశ్రయానికి, రెండు విమానాలను చండీగఢ్ విమానాశ్రయానికి, మరో విమానాన్ని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు.
విమానాల మళ్లింపుతో ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు విమానాల రాకపోకలపై తాజా సమాచారాన్ని తెలుసుకుని ప్రయాణం చేయడం మంచిది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!