
జనరల్

భారీ వర్షాల ప్రభావంతో మంచిర్యాల జిల్లాలోని పలు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు తవ్వకాల పనులు నిలిచిపోయాయి. ఇందారం, శ్రీరాంపూర్, కళ్యాణి ఖని, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు నిలిచిపోవడంతో గనుల కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో రోజుకు సుమారు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
గనుల్లోని నీటి మట్టాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే గనుల్లోని నీటిని తొలగించి ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టనున్నారు. వర్షాల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగితే బొగ్గు సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!