

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇంజాపూర్లో 74.16 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణదారులకు సహకరిస్తున్నారని మండిపడింది. న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ, అధికరణం 226 కింద తన అధికారాలను వినియోగించి సీబీసీఐడీ దర్యాప్తును ఆదేశించింది. మూడు నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీకి సూచించింది.
విచారణలో భూమిలో ఎక్కువ భాగం ఆక్రమణకు గురైందని, అపార్ట్మెంట్లు, వ్యవసాయం, పబ్లిక్ నిర్మాణాలు వంటి అక్రమ వినియోగాలు ఉన్నట్లు కోర్టు గుర్తించింది. సరైన వివరాలు ఇవ్వకుండా కలెక్టర్ కౌంటర్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. సంబంధిత తహసీల్దార్, గ్రామ అధికారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ కేసును న్యాయవాది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాఖలు చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!