

భారత అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ‘స్పేస్ వెంచర్ క్యాపిటల్ ఫండ్’ నుంచి పెట్టుబడులు అందుకున్న తొలి సంస్థగా హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్ నిలిచింది. ఈ సంస్థకు రూ.60 కోట్లు లభించాయి. రూ.1,000 కోట్ల నిధులతో ఉన్న ఈ ఫండ్‌ను ఇన్-స్పేస్ ఆధ్వర్యంలో సిడ్బీ వెంచర్ క్యాపిటల్ నిర్వహిస్తోంది. ఈ నిధులను స్వదేశీ ఉపగ్రహాల తయారీ, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల విస్తరణకు వినియోగించనున్నట్లు సంస్థ పేర్కొంది.
సిడ్బీ వెంచర్ క్యాపిటల్ సీఈఓ అరూప్ కుమార్ మాట్లాడుతూ, ఆవిష్కరణలు, తయారీ, ప్రయోగాలు, వాణిజ్య విస్తరణలను సమగ్రంగా అందించే సంస్థలే భవిష్యత్తు అంతరిక్ష దిగ్గజాలుగా ఎదుగుతాయని తెలిపారు. మరోవైపు ఇండిగో, అకార్ సంస్థలు లాయల్టీ భాగస్వామ్యాన్ని ప్రకటించగా, జేబీఎం ఎలక్ట్రిక్ వెహికల్స్ డ్రైవ్‌ఎన్‌కు 500 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!