

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెలుగులో ఓ టాప్ హీరోతో భారీ స్థాయిలో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో భన్సాలీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన సూపర్‌స్టార్ మహేష్ బాబును కలిసి ఓ కథ వినిపించినట్లు సమాచారం. దీంతో భన్సాలీ-మహేష్ కాంబినేషన్‌పై కొత్తగా చర్చ మొదలైంది.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు పూర్తిగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ప్రాజెక్ట్‌పైనే దృష్టి పెట్టారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు ఆయన తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో భన్సాలీ చెప్పిన కథకు మహేష్ స్పందన ఎలా ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఏదీ లేదు. ‘వారణాసి’ పూర్తయ్యే సమయానికి ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!