

హైదరాబాద్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు. పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్లలో ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, విధుల్లో ఉన్న అధికారులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరానికి అనుగుణంగా ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
వర్షాల సమయంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్లు, తెగిపోయిన విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్ల వద్ద నీరు నిలిచే అవకాశం ఉన్నందున వాహనదారులు అత్యంత జాగ్రత్తగా, నెమ్మదిగా ప్రయాణించాలని కోరారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ట్రాఫిక్ పోలీసుల అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!