

దిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జికి నిరసనగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్డీఎస్ తదితర విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీలు హైదరాబాద్‌లో ఆందోళన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ లోక్‌భవన్ ముట్టడికి యత్నించిన విద్యార్థులను ఖైరతాబాద్ కూడలి వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులను పోలీసు వాహనాల్లో తరలించారు.
విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని ఆరోపించారు. సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు దేశవ్యాప్తంగా విద్యా హక్కులు, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!