
క్రీడలు

హైదరాబాద్‌లోని నాలుగు చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా ఆధ్వర్యంలో రూ.107 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇబ్రహీం పెద్ద చెరువు, భగీరథమ్మ చెరువు, కాముని చెరువు, కాప్రా చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ భూమిపూజ చేసి ప్రారంభించారు. వరదల నివారణతో పాటు భూగర్భ జలాల పెంపు ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టు చేపట్టబడింది.
మొత్తం 311 ఎకరాల పరిధిలో ఉన్న ఈ నాలుగు చెరువులకు సరికొత్త రూపురేఖలు ఇవ్వనున్నారు. వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, చిన్నారుల ఆట స్థలాలు వంటి సౌకర్యాలతో చెరువులను అభివృద్ధి చేయనున్నారు. పెద్ద చెరువుల్లో పర్యాటక శాఖ సహకారంతో బోటింగ్ సదుపాయాలు తీసుకురావడానికి కూడా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఈ ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!