

కారుతో ఢీకొట్టిన ఘటనలో డాక్టర్ ప్రియాంక మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు వ్యవస్థ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకుండా గత మూడు రోజులుగా వారిని పోలీసులు రక్షించేందుకు ప్రయత్నించారంటూ ఆయన ఆరోపించారు. కేసు తీవ్రతను తగ్గించి నిందితులను కాపాడేందుకు కొందరు ప్రభావవంతమైన వ్యక్తుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తగిన ఆర్థిక సహాయం, భరోసా అందలేదని భరత్‌కుమార్ విమర్శించారు. ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి నగరంలోని విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు బంద్‌తో పాటు నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!