
జనరల్

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవిపై మాజీ క్రికెటర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2023లోనే భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం తనకు వచ్చిందని వెల్లడించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవిని స్వీకరించలేకపోయానని తెలిపాడు.
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఆ బాధ్యతల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మణ్ చెప్పాడు. భారత క్రికెట్ అభివృద్ధికి సీఓఈ ద్వారా మరింతగా సేవలందించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!