

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ విహార్‌లో కృష్ణానది ఒడ్డున వరుణయాగం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహిస్తున్న ఈ యాగాన్ని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి రెడ్డి దంపతులు ప్రారంభించారు. యాగ ప్రారంభంలో ఋత్వికులు గోపూజ, విశ్వక్సేన పూజ నిర్వహించి, యాగశాల ప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యాదగిరిగుట్ట ఈఓ భవాని శంకర్, డిప్యూటీ ఈఓతో పాటు దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వరుణయాగం ముగింపు సందర్భంగా మధ్యాహ్నం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!