

ఇరాన్‌పై తక్షణ సైనిక చర్యకు బదులుగా ఆర్థిక ఆంక్షలు, దౌత్యపరమైన ఒత్తిడి, చర్చల ద్వారా ఫలితం సాధించాలన్న వ్యూహాన్ని అమెరికా అనుసరిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇరాన్‌తో ప్రస్తుతం “పాక్షిక చర్చలు” మాత్రమే జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో భారీ ద్రవ్యోల్బణం ఉందని, ఆ దేశ ఆర్థిక పరిస్థితిని అమెరికా నిశితంగా గమనిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సైనిక ఘర్షణతో అమెరికాపై పడే ఆర్థిక, రాజకీయ ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని గరిష్ఠ ఒత్తిడి ద్వారా చర్చలకు ఇరాన్‌ను తీసుకురావాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది.
అమెరికా–ఇరాన్ వివాదంలో హర్ముజ్ జలసంధి, చమురు ఎగుమతులు, అణు కార్యక్రమం, ఆంక్షలు ప్రధాన అంశాలుగా కొనసాగుతున్నాయి. హర్ముజ్‌ను సాధారణ స్థితికి తీసుకురావాలంటే అమెరికా నౌకాదళ, చమురు ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు, అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొంటూ, మధ్యవర్తుల ద్వారా చర్చలకు అనుకూల వాతావరణం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా, గాజాపై అమెరికా ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యతిరేకించగా, యెమెన్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీల చర్యలు కూడా ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!