

కౌలాలంపూర్ నుంచి 159 మంది ప్రయాణికులతో కోల్‌కతా చేరుకున్న మలేషియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్184 విమానానికి శనివారం రాత్రి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో కాక్‌పిట్‌లోకి అకస్మాత్తుగా లేజర్ కిరణాలు ప్రసరించాయి. లేజర్ కాంతి పైలట్ కళ్లపై పడటంతో కొద్దిసేపు చూపుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్ వెంటనే ల్యాండింగ్ ప్రయత్నాన్ని నిలిపివేసి, విమానాన్ని కొంతసేపు గాల్లో చక్కర్లు కొట్టించారు.
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత విమానం ఆలస్యంగా అయినప్పటికీ సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని 159 మంది ప్రయాణికులతో పాటు విమానాశ్రయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయ పరిసరాలు, విమానాల ప్రయాణ మార్గాల్లో లేజర్ లైట్ల వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ ఘటన చోటుచేసుకోవడంపై విమానయాన వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లేజర్ కిరణాలు ఏ ప్రాంతం నుంచి ప్రసరించాయనే దానిపై ప్రత్యేక బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!