

ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న నీట్ పునఃపరీక్ష కోసం జాతీయ పరీక్షల సంస్థ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. తొలిసారిగా భారత వాయుసేన సేవలను వినియోగిస్తూ ప్రశ్నపత్రాలను ముద్రణ కేంద్రాల నుంచి పరీక్షా కేంద్రాలకు విమానాల ద్వారా తరలించనుంది. రవాణా ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు.
నీట్ పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీకైందని లేదా విక్రయానికి ఉందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు జాతీయ పరీక్షల సంస్థ సూచించింది. ఈ పరీక్ష భారత్లోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం నీట్ ప్రశ్నపత్ర లీక్ వ్యవహారం, పరీక్షల భద్రత, సిబ్బంది సంఖ్య, 2022 నుంచి జరిగిన నియామకాల వివరాలపై జాతీయ పరీక్షల సంస్థ, కేంద్ర మాధ్యమిక విద్యా మండలిని లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!