
జనరల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. షిల్లాంగ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ, మూడు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
షిల్లాంగ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. అయితే, ఆరు నెలల్లో విచారణ పూర్తికాకపోతే మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!