

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాలు, సంక్షేమం, విద్య, నీటిపారుదల, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చర్చించిన మంత్రివర్గం, దీనిపై మరింత అధ్యయనం అనంతరం తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి బాధ్యతలు అప్పగించింది. అలాగే 'నేతన్న భరోసా' పథకం కింద 50 ఏళ్లలోపు బీపీఎల్ చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గోదావరి పుష్కరాల భద్రతా ఏర్పాట్లకు రూ.50 కోట్లు, నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 పనుల వ్యయ పెంపు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, విద్యా, వైద్య, పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!