
జనరల్

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్‌కు సంబంధించిన 2027 పూర్తి షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వనున్న ఈ ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జూన్ 18న నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ప్రారంభమవుతుంది. అనంతరం లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్, ది ఓవల్ వంటి చారిత్రాత్మక వేదికల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
జూన్ 30 నుంచి జూలై 4 వరకు లార్డ్స్‌లో రెండో టెస్ట్, జూలై 8 నుంచి 12 వరకు ఎడ్జ్‌బాస్టన్‌లో మూడో టెస్ట్ నిర్వహించనున్నారు. జూలై 21 నుంచి 25 వరకు సౌతాంప్టన్ నాలుగో టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వగా, జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు లండన్‌లోని ది ఓవల్‌లో చివరి టెస్ట్ జరుగుతుంది. మరోసారి ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీ పోరుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!