

ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌పై ఓ రోగి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న సదరు రోగికి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స వర్తించదని, మొత్తం ఖర్చును ఆమెనే భరించాలని ఆసుపత్రి సిబ్బంది తెలిపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.
బంజారాహిల్స్‌లోని నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్‌కు సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్సిడీపై కేటాయించిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. చికిత్సలో ఆలస్యం జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆసుపత్రిని హెచ్చరించింది. పిటిషనర్‌ను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!