

పాకిస్థాన్ వేదికగా 14వ సౌత్ ఏషియన్ గేమ్స్ నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2027 ఏప్రిల్ 3 నుంచి 11 వరకు ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ నగరాల్లో ఈ క్రీడా సంబరాలు జరగనున్నాయి. మొత్తం 28 క్రీడాంశాల్లో 346 పతక ఈవెంట్లు నిర్వహించనుండగా, సుమారు 3,200 మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది.
ఇక ఈ గేమ్స్‌లో భారత్ పాల్గొంటుందా లేదా అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన సౌత్ ఏషియా ఒలింపిక్ కౌన్సిల్ సమావేశానికి భారత ప్రతినిధులు జూమ్ ద్వారా వర్చువల్‌గా హాజరయ్యారు. బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ప్రతినిధులు మాత్రం ప్రత్యక్షంగా సమావేశానికి హాజరయ్యారు. అయితే భారత్ వర్చువల్‌గా సమావేశంలో పాల్గొనడాన్ని గేమ్స్‌లో భారత బృందం పాకిస్థాన్‌కు వెళ్లడం ఖరారైనట్లుగా భావించరాదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తుది నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!