

తెలంగాణ మంత్రి కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. కొండా సురేఖ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని, కమిటీ తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి కట్టుబడి ఉండాలని సీఎం పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడబోనని, ఊహాజనిత కథనాలపైనా స్పందించబోనని స్పష్టం చేశారు.
మరోవైపు వచ్చే నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణలో జాప్యం జరిగితే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావని అన్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ అనుమతులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!