

గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్, ఢిల్లీలోని ఐదు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. RC-01/2025/NIA/AMD కేసుకు సంబంధించి ఈ తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రభుత్వానికి చెందిన పలు వెబ్‌సైట్లపై జరిగినట్లు ఆరోపిస్తున్న సైబర్ దాడులపై ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత ఈ కేసును గుజరాత్ ATS నమోదు చేయగా, అనంతరం NIA దర్యాప్తు చేపట్టింది.
దర్యాప్తులో భాగంగా ప్రభుత్వ, కీలక రంగాలకు చెందిన పలు వెబ్‌సైట్లను DDoS దాడులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడులకు సంబంధించి నిందితులకు సాంకేతిక సహకారం అందించినట్లు అనుమానిస్తున్న వ్యక్తుల పాత్రపైనా NIA దృష్టి సారించింది. తాజా సోదాల్లో కేసుకు సంబంధించినవిగా భావిస్తున్న డిజిటల్ పరికరాలు, పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపిస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు, ఇతర అనుమానితుల సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!