

భారత్‌కు స్వాతంత్రం లభించిన ఆగస్టు 15 తేదీకి అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం ప్రత్యేక గౌరవం ప్రకటించింది. ఆ రోజును అధికారికంగా ‘ఇండియా డే’గా గుర్తిస్తున్నట్లు గవర్నర్ మౌరా హీలీ వెల్లడించారు. భారత సంతతి ప్రజలు రాష్ట్ర అభివృద్ధికి, సమాజానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ, ఈ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
మసాచుసెట్స్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, విభిన్న భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ భారతీయుల ఐక్యత ప్రపంచానికి ఆదర్శమని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.6 కోట్ల మంది భారత సంతతి ప్రజలు, అమెరికాలో 50 లక్షలకు పైగా భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారని వెల్లడించింది. వైద్యం, విజ్ఞానం, సాంకేతికత, విద్య, వ్యాపారం, ప్రజాసేవ వంటి అనేక రంగాల్లో భారత సంతతి ప్రజలు అమెరికా అభివృద్ధికి విశేషంగా దోహదపడుతున్నారని గవర్నర్ ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!