

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కమాండ్‌లో స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఈస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే యుద్ధనౌకగా మహేంద్రగిరిని రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.
సుమారు 75 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ యుద్ధనౌకలో బ్రహ్మోస్ క్షిపణులు, రాకెట్ లాంచర్ వ్యవస్థతో పాటు అత్యాధునిక యుద్ధ సామర్థ్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక షిప్‌బిల్డింగ్, మారిటైమ్ విజన్ 2030 ద్వారా భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. భారత విధానం శాంతేనని, అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!