
సినిమాలు

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రాష్ట్ర అంత్యక్రియలకు హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానం పంపినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ఇప్పటివరకు భారత ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. జూలై తొలి వారంలో టెహ్రాన్, ఖోమ్ నగరాల్లో అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నట్లు సమాచారం.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘర్షణల సమయంలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది. అనంతరం మొజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీకి పంపిన ఆహ్వానం భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలకు ప్రాధాన్యాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అంత్యక్రియలకు భారత తరఫున ఎవరు హాజరవుతారన్న విషయంపై ఇంకా అధికారిక స్పష్టత లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!