
గాసిప్స్

తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని, నమూనా రాకెట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు, అంతరిక్ష రంగంలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ద్వారా 2,367 కిలోల బరువున్న భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 2.55 గంటలకు శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్వీ-ఎఫ్17ను నింగిలోకి పంపనున్నారు. 50.9 మీటర్ల పొడవు, సుమారు 420.7 టన్నుల బరువున్న ఈ రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగించనున్నారు. ప్రయోగం విజయవంతమైతే భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!