
సినిమాలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు. ఈ నెల 3న అన్ని మండలాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ నెల 4, 5 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సభలు, ర్యాలీలు నిర్వహించాలని మహేష్‌కుమార్ గౌడ్ ఆదేశించారు. కార్యక్రమాలు విజయవంతమయ్యేలా డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!