
సినిమాలు

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల మెరుగుదలకు కీలక చర్యలు ప్రారంభమయ్యాయి. రూ.23 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించనున్నారు.
ఈ ఆలయానికి సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 15 వేల మంది భక్తులు, శని, ఆదివారాలు మరియు సెలవు రోజుల్లో 15 వేల నుంచి 20 వేల మంది వరకు వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త నిర్మాణాలు చేపడుతూ, రద్దీ నియంత్రణతో పాటు దర్శనాన్ని మరింత వేగవంతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.



















కామెంట్స్ (1)
Good decision will be very useful for the pilgrims