

కాప్రా చెరువులో గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి వెసులుబాటు లేదని హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తెలిపారు. 113 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాప్రా చెరువును అర్బన్ వెట్‌ల్యాండ్‌గా గుర్తించిన నేపథ్యంలో.. చెరువు జీవవైవిధ్యాన్ని, వలస పక్షుల ఆవాసాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అందువల్ల ప్రధాన చెరువులో గణేశ్ నిమజ్జనం చేయడం సరికాదని స్పష్టం చేశారు. చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని, పెద్ద విగ్రహాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కాప్రా చెరువును పర్యావరణహితంగా అభివృద్ధి చేసేందుకు హైడ్రా చర్యలు చేపడుతోందని రంగనాథ్ తెలిపారు. చెరువు పరిరక్షణలో ప్రజలు, భక్తులు సహకరించాలని కోరారు. పండుగల సందర్భంగా నిమజ్జన కార్యక్రమాల వల్ల ప్రధాన జలవనరుపై పర్యావరణ ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ, నిర్దేశిత ప్రదేశాలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!