
టెక్నాలజీ

బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన బావమరిది, శోభమ్మ తమ్ముడు దివంగత జోగినిపల్లి శ్రీనివాసరావు దశదిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం కొంపెల్లిలోని ఆస్పిషియస్ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శ్రీనివాసరావు చిత్రపటానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
శ్రీనివాసరావు ఈ నెల 13న మృతి చెందిన విషయం తెలిసిందే. దశదిన కార్యక్రమంలో ఎంపీలు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!